Eturu Nagaram | పురుగుల మందు తాగిన యువకుడు మృతి

ఏటూరునాగారం, జులై 8 (ఆంధ్రప్రభ) : చిన్నపాటి గొడవతో ఆవేశానికి లోనైన యువకుడు పురుగుల మందు తాగి మృతిచెందిన సంఘటన ఏటూరునాగారం (Eturu Nagaram) లోని తాళ్లగడ్డలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన పంజాల కృష్ణ కుమారుడు పంజాల వినయ్ (Panjala Vinay) ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా క్షణికావేశంలో ఈనెల 6న పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు స్థానికంగా వైద్యం అందించి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ (Warangal) లోని ఎంజీఎం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
