KNL | వేసవిలో త్రాగు నీటి సమస్య తలెత్తకుండా చూడండి : కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు బ్యూరో, ( ఆంధ్రప్రభ) : వేసవి కాలంలో జిల్లాలో త్రాగు నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా గాజులదిన్నె ప్రాజెక్ట్ డిఈఈ విజయ్ కుమార్ ను ఆదేశించారు. శనివారం గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం గాజుల దిన్నె ప్రాజెక్ట్ లో ఎన్ని టీఎంసీ ల నీరు అందుబాటులో ఉంది, ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది అని కలెక్టర్ గాజులదిన్నె ప్రాజెక్ట్ డిఈఈ ని అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో జిల్లాలో త్రాగు నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని కలెక్టర్ ప్రాజెక్ట్ డిఈఈ ని ఆదేశించారు.
అలాగే హెచ్ ఎన్ ఎస్ ఎస్ నుండి ప్రాజెక్టుకు నీటి విడుదల గురించి కలెక్టర్ ఆరా తీశారు.నీరు ఏమైనా తగ్గుతోందా అని నిత్యం సమీక్ష చేస్తూ ఉండాలని, ఒకవేళ నీటి నీటి ఇన్ ఫ్లో ఏమైనా తగ్గితే వెంటనే తెలియచేయాలని కలెక్టర్ గాజులదిన్నె ప్రాజెక్ట్ డిఈఈ ని ఆదేశించారు.
కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, గాజులదిన్నె ప్రాజెక్ట్ డిఈఈ విజయ్ కుమార్, గోనెగండ్ల తహసిల్దార్ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు