IND vs ENG | టాస్ గెలిచిన ఇంగ్లండ్… ఫస్ట్ బ్యాటింగ్ మనదే !
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న సూర్యసేన ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ని ముగించాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లిష్ జట్టు కూడా అదే ఆశయంతో బరిలోకి దిగనుంది.
కాగా, ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది..
జట్టు మార్పులు
ఇంగ్లండ్: సాకిబ్ మహమూద్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు.
భారత్: అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
టీమిండియా : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి
ఇంగ్లండ్ : బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్