Engineering College | ఘర్షణ.. అసలు ఏమైంది..?

Engineering College | ఘర్షణ.. అసలు ఏమైంది..?

Engineering College | పెడన, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా పెడన మండలం నందమూరు గ్రామంలోని శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ విద్యార్థుల మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కళాశాల ప్రాంగణంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలు విద్యార్థుల్లో భయాందోళనకు దారితీశాయి. మొదటి రోజు చోటుచేసుకున్న ఘర్షణ పై సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అల్లర్లు సద్దుమణిగినట్లుగా భావించినప్పటికీ, రెండో రోజు కూడా కాలేజ్ క్యాంపస్‌లోనే ఉద్రిక్తత కొనసాగడం కలకలం రేపింది.

ఈ పరిణామాలతో పలువురు విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. కళాశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తోందా? లేక కళాశాల యాజమాన్య పర్యవేక్షణ లోపించిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భద్రత, క్రమశిక్షణ అంశాల పై యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Leave a Reply