Endapalli | గ్రామాభివృద్ధి కోసం కృషి

Endapalli | గ్రామాభివృద్ధి కోసం కృషి
- ఎండపల్లి మండలంలో నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం
Endapalli | ఎండపల్లి, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని నూతనంగా సర్పంచులు అన్నారు. ఎండపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులతో కలిసి ఇవాళ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నూతన ప్రజాప్రతినిధులు బాధ్యతలు స్వీకరించారు.
శానబండ గ్రామంలో గాదం భాస్కర్, సూరారంలో కోడిపెల్లి కొమురమ్మ, పడకల్ గ్రామ సర్పంచిగా బెడ్డల ప్రవీణ్ ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఉండేడా గ్రామంలో ఆవుల మమత, గుల్లకోటలో గొల్లపల్లి మల్లేష్ గౌడ్ కొండాపూర్ లో తాటిపర్తి రాజవ్వ, కొత్తపేట లో జీరెడ్డి మహేందర్ రెడ్డి, సర్పంచులుగా బాధ్యతలు చేపట్టారు.
అలాగే మారేడుపల్లి గ్రామంలో బాలసాని శారదా, గొడిసెలపేటలో కందికట్ల అమృత, పాతగూడూరు గ్రామంలో జగదీశ్వర్ రెడ్డి, చర్లపల్లి గ్రామంలో పడిదాం లావణ్య వార్డ్ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ముంజంపల్లి గ్రామంలో సింగిరెడ్డి లింగారెడ్డి, ఎండపల్లి గ్రామంలో మారం సునీత, అంబరిపేట గ్రామంలో దర్శనాల నరేష్, రాజారాంపల్లి గ్రామంలో సంగ రమేష్ యాదవ్ సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులు గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
