Encounter | జ‌మ్ములో ఎన్ కౌంట‌ర్ – ఉగ్ర‌వాదుల కాల్పుల్లో అమ‌రుడైన జ‌వాన్

ఉద్ధంపూర్ – జమ్ముకశ్మీర్ లో భద్రతాబలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం ఉదయం జమ్ముకశ్మీర్‌ పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా డుడు-బసంత్‌గఢ్‌ ఏరియాలో ఉగ్రవాదులు తరాసపడటంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.


ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడికి మెడికల్‌ టీమ్‌ ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఇండియన్‌ ఆర్మీ సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా గత మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్‌లో ఐదుగురు ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 28 మంది మరణించారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపులను కూడా ముమ్మరం చేశారు.

Leave a Reply