Employment Guarantee | మోడీ, అమిత్ షా కుట్ర…మహేష్ కుమార్ గౌడ్

Employment Guarantee | మోడీ, అమిత్ షా కుట్ర…

  • మహేష్ కుమార్ గౌడ్

Employment Guarantee | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : ఉపాధి హామీ పథకంపై మోడీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… కొత్త చట్టంతో ప్రజలకు ఉపాధి లేకుండా పోతుందన్నారు.

మోడీ, అమిత్ షాలకు పేదల గోడు పట్టదని, అదానీ కోసమే పనిచేస్తున్నారన్నారు. అప్పులపాలైన తెలంగాణ ఉపాధి హామీ పనుల్లో 40శాతం భరించడం కష్టమన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు.

Leave a Reply