Employees | టెక్ నిపుణుల ఆందోళన..

Employees | టెక్ నిపుణుల ఆందోళన..

Employees | బెంగళూర్, ఆంధ్రప్రభ: బెంగళూర్ టెక్ ఉద్యోగాలపై 2025లో కృత్రిమ మేధ (ఏఐ) తీవ్ర ప్రభావం చూపింది. ఏఐ దెబ్బకు అనేక దిగ్గజ కంపె నీలు వేల సంఖ్యలో ఉద్యోగుల పై వేటు వేశాయి. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రభావం కనిపించింది. అనేక సంవత్సరాలుగా ప్రతి ఏటా వేలాది మందిని రిక్రూట్ చేసుకునే ఐటీ కంపెనీలు 2025లో మాత్రం దఫదఫాలుగా ఉద్యోగుల తొలగింపును చేపట్టాయి. అన్ని టెక్ కంపెనీలు భారీగా ఏఐని అమల్లోకి తీసుకు రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను తొలగించాయి. ఏఐని వినియోగించుకోవడం తో పాటు, ఉద్యోగులను తొలగించడం ద్వారా లాభాలను పెంచుకోవాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఐటీ కంపెనీలు,(IT Company) టెక్ కంపెనీలు, స్టార్టప్లు ఇలా పలు రంగాలకు చెందిన కంపెనీలు ఉద్యోగుల తొలగింపులో పోటీ పడ్డాయి. భారత్ కేంద్రంగా పలు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2025లో 12 వేల మంది ఉద్యోగులను తొలగిం చింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 2 శాతానికి సమానం. ఉద్యో గుల తొలగింపు 2026లోనూ టీసీఎస్ కొనసాగించే సూచనలు ఉన్నాయి. మిడ్ లెవల్ నుంచి సీనియర్ లెవల్ ఉద్యోగులను ఆఫ్ తొలగించారు. ఏఐ డెలివరీ మోడల్ను అమలు 2025లో వేల సంఖ్యలో లేఆఫ్లు చేయాలని నిర్ణయించడంతోనే భారీగా ఉద్యోగులను ఇంటికి పంపించింది టీసీఎస్. దేశంలో భారీగా విస్తరిస్తూ వచ్చిన స్టార్టప్లు కూడా వృద్ధి నమూనా నుంచి వ్యయాల తగ్గింపు విధానంపైపు మొగ్గు చూపాయి.

Employees | ఉద్యోగుల పై వేటు

దీంతో భారత స్టార్టప్ ఎకోసి స్టమ్ 2025లో నిర్ణ యాత్మ క మార్పుకు గురైంది. దూకుడుగా విస్తరిస్తూ వచ్చిన చాలా కంపెనీలు ఆటోమేటెడ్ కార్యకలా పాల వైపు మొగ్గు చూపాయి. ఈ నిర్ణయం వేలాది ఉద్యోగుల తొలగింపుకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఓలా ఎలక్ట్రిక్ సంస్థ పెరుగుతున్న నష్టాలను తగ్గించుకుని, లాభాలు పెంచు కునేందుకు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రధా నంగా ఫ్రంట్- ఎండ్ ఆపరేషన్స్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా లేఆఫ్క గురయ్యారు. క్విక్ కామర్స్ సంస్థ జెప్టో 300 మంది ఉద్యోగులను (Employes) ఇంటికి పంపించింది. 2025లో సంస్థ కొత్తగా పెట్టుబడులను సమీకరించుకున్నప్పటికీ ఉద్యోగులను తొలగించింది. ఇన్ వాయిస్, ఇన్వెంటరీ వర్క్ లో ఉన్న ఉద్యోగులను తొలగించి సాఫ్ట్వేర్ను తీసుకు వచ్చింది. కొన్ని పనులను ఔట్సోర్స్కి ఇచ్చింది. డైలీ హంట్ కు చెందిన కంటెంట్, ఫామ్ వెర్సే ఇన్నోవేషన్ సుమారు 350 మంది ఉద్యోగులను తొలగించింది. నిధుల కొరత, కంటెంట్ మోడరేషన్, క్యూ రేషన్లో ఏఐని వినియోగించుకోవడం వంటి కారణాలతో ఈ సంస్థ ఉద్యోగుల పై వేటు వేసింది.

Employees

Employees | 2 లక్షల వరకు ఉద్యోగాలపై ప్రభావం

వివాదస్పదమైన ఏఐ సంస్థ గుప్సుప్ లాభాలు పెంచుకునేందుకు వీలుగా 500 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. 2025 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీని ఈ చట్టం పూర్తిగా దెబ్బ తీ సింది. సుమారు 2 లక్షల కోట్ల విలువైన ఇండస్ట్రీ ఈ చట్టం మూ లంగా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఈ రంగంలో ప్రముఖ కంపెనీగా ఉన్న డ్రీమ్ 11 సంస్థ 500 మంది ఉద్యో గులను ఇంటికి పంపించింది. మొత్తంగా గేమింగ్ ఇండస్ట్రీలో నేరుగా 2 లక్షల వరకు ఉద్యోగాలపై ప్రభావం చూ పింది. నిషేధం మూలంగా ప్రధానంగా పేమెంట్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, సపోర్ట్ సర్వీసెస్ ఉద్యోగాలను తూడ్చిపెట్టింది. మొబైల్ (Mobile) ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) 600 మంది ఉద్యోగులను తొల గించింది. ఇందో ఈ సంస్థ భారత్లో 60 శాతం మంది ఉద్యో గులను తొలగించినట్లయ్యింది. గేమ్స్ క్రాఫ్ట్స్ అనే సంస్థ 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది.

Employees

Employees | ఉద్యోగులను అమెజాన్ తొలగించడం ఇదే తొలిసారి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాటిలో అమెజాన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను లేఆఫ్ చేసింది. అక్టోబర్లో సంస్థ 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్థాయి లో ఉద్యోగులను అమెజాన్ తొలగించడం ఇదే తొలిసారి. హైద రాబాద్, గుర్గామ్, బెంగళూర్ లో పని చేస్తున్న 1000 మం ది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా 15,000 మందిని తొలగించింది. ఇందులో జులై లోనే 9 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంప్యూటర్స్, లాప్టాప్స్ చిప్ మేకర్ ఇంటెల్ మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొలగించింది. 2024 చివరి నాటికి ఇంటెల్లో లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 25 శాతం తొలగించి సంఖ్యను 75 వేలకు కుదించింది. యాపిల్ సంస్థ అమెరికాలో (America) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిం చింది. మెటా 600 మం దిపై వేటు వేసింది. టెలిక మ్యూనికేషన్స్ సంస్థ వెరిజోనా 13, 000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. సిమెన్స్ 5,600 మం దిని ఇంటికి పంపించింది. సేల్స్ ఫోర్స్ 4 వేల మందిని, హెచ్పీ 6 వేల మందిని లేఆఫ్ చేసింది. 2025లో ఏఐ ప్రభావం, ఏఐని వినియోగించుకోవడం పెరగడంతో వేల సంఖ్యలో ఉద్యో గు లు రోడ్డున పడ్డారు. ఈ ప్రభావం కొత్త సంవత్సరంలో మ రింత ఎక్కువగా ఉంటుందని టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CLICK HERE TO READ ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

CLICK HERE TO READ MORE

Leave a Reply