Email | తెలంగాణ సీఎంవో, లోక్‌భవన్‌లకు బాంబు బెదిరింపులు

Email | తెలంగాణ సీఎంవో, లోక్‌భవన్‌లకు బాంబు బెదిరింపులు

Email | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు లోక్‌భవన్ (రాజ్‌భవన్‌)ను బాంబులతో పేల్చేస్తామంటూ మెయిల్ రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ రోజు ఉదయం గవర్నర్ కార్యాలయంతో పాటు ముఖ్యమంత్రి(Chief Minister) కార్యాలయానికి వాసుకీ ఖాన్ పేరుతో ఒక ఈ-మెయిల్ వచ్చింది.

అందులో సీఎంవోతో పాటు రాజ్‌భవన్‌లో బాంబులు అమర్చామని, వాటిని త్వరలోనే పేల్చేస్తామంటూ ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆ ఈ-మెయిల్(Email) ద్వారా మెసెజ్ పెట్టాడు. విషయం తెలిసిన వెంటనే గవర్నర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్ స్వయంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(Disposal Squad), యాంటీ-సబోటేజ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సీఎంవోతో పాటు లోక్‌భవన్ ప్రాంగణాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

సుమారు మూడు గంటల పాటు జరిపిన తనిఖీల అనంతరం ఎక్కడా బాంబులు, అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్స్ టీమ్ మెయిల్ ఐపీ అడ్రస్, సర్వర్ లొకేషన్, పంపిన వారి వివరాలను గుర్తించే పనిలో పడింది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో సీఎంవో, లోక్‌భవన్‌ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Leave a Reply