Elkoti Ella Reddy | సేవలు చిరస్మరణీయం..

Elkoti Ella Reddy | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి సేవలు చిరస్మరణీయమని మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగిల్ విండో అధ్యక్షుడు ఎం బాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో దివంగత మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి 11వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నారాయణపేట మక్తల్ అభివృద్ధికి ఎల్లారెడ్డి ఎనలేని సేవలు చేశారని ఈ ప్రాంతం అభివృద్ధికి కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేదవారికి ఎన్నో సేవలు చేసి రాష్ట్రస్థాయిలో ఊట్కూర్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని అన్నారు. నీతి నిబద్ధతతో రాజకీయాల్లో మచ్చలు లేని నాయకుడిగా కృషి చేశాడని ఆయన లేని లోటు తీరనిదని విచారం వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో ఎందరో పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసి పేద ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహనీయులు ఎల్లారెడ్డి అని గుర్తు చేశారు. ఎల్లారెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన చూపిన మార్గంలో నడవాలన్నారు. ఎల్లారెడ్డి తనయులు జనార్దన్ రెడ్డి, నారాయణరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డిలు మాట్లాడుతూ… తమ తండ్రి ఎల్కోటి ఎల్లారెడ్డి చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.

రాజకీయ సామాజిక సేవలు చేపట్టి ఎల్లారెడ్డి కీర్తి ప్రతిష్టలు మరింత పెంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు శివరామరాజు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్, మల్లికార్జున్, శంకర్ రెడ్డి, నాసిర్ ఖాన్, కోరం మహేష్ రెడ్డి, జగదీష్ గౌడ్, గోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply