Elephants Terror | ఏనుగుల బీభత్సం…

Elephants Terror | ఏనుగుల బీభత్సం…

పంటలకు భారీ నష్టం…


Elephants Terror | పార్వతీపురం, ఆంధ్రప్రభ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం (Parvathipuram) మన్యం జిల్లాలోని కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామ పరిసరాల్లో ఏనుగులు బీభత్సం (Elephants Terror) సృష్టించాయి. ఏనుగుల గుంపు అర్థరాత్రి సమయంలో గ్రామ పరిసరాల పంట పొలాల్లోకి చొచ్చుకుని వచ్చి పంటలకు భారీగా నష్టం కలిగిస్తున్నాయి.

ఓ రైతు శివుని నాయుడు సాగుచేస్తున్న ఆనపకాయ, టమాటా, ఫామ్ ఆయిల్ పంటలను ఏనుగులు పూర్తిగా ధ్వంసం (Crops destroyed) చేశాయి. పొలాలన్నీ చిందరవందరగా మారడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇక, ఏనుగుల సంచారంతో గ్రామంలోని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ ప్రాంతంలో తరచూ ఏనుగుల బెడద పెరుగుతోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగులను అడవుల్లోకి మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply