ఎమ్మెల్యే చొరవతో తీరిన విద్యుత్ కష్టాలు

ఊర్కొండ, ఆంధ్రప్రభ ; స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో రాచాలపల్లి గ్రామంలో విద్యుత్ కష్టాలు తీర్చమని సర్పంచ్ మాడుగుల మహేష్ అన్నారు. రాచలపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలతో నిత్యం గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో స్పందించిన వారు గ్రామానికి 25 KV ట్రాన్స్ఫార్మర్, 25 KV మూడు సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయడం జరిగిందని వాటిని శనివారం గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటస్వామి , నాయకులు , అమరేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply