Electricity | గుండెపోటుతో విద్యుత్ శాఖ ఫోర్ మెన్ మృతి

Electricity | గుండెపోటుతో విద్యుత్ శాఖ ఫోర్ మెన్ మృతి
Electricity | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లాఉట్నూర్ పనిచేస్తున్న విద్యుత్ శాఖ(Electricity Department) ఫోర్ మెన్ అధికారి కొత్తూరి అనంతయ్య గుండెపోటుతోమృతి చెందారు. అనంతయ్య ఇంటి వద్ద ఆయన పార్థివ దేవానికి ఆదిలాబాద్ మంచిర్యాల్ జిల్లాల ట్రాన్స్కో విద్యుత్ శాఖ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు వెళ్లి ఆయన పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన అంత్యక్రియలలో ఆదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బిరుదుల లాజర్, దళిత రాష్ట్ర నాయకులు అరకిల అశోక్ మైనార్టీ నాయకులు, అబ్దుల్ కైసర్, డ్రైవర్ల సంఘం ఉపాధ్యక్షుడు జాడి కాంతారావు, నాయకులు, ఉద్యోగులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొని అనంతయ్య పార్ధీవ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

