Electric shock | ఇద్దరు మృతి
Electric shock | ప్రకాశం, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్ (Electric shock) తగిలి ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఐదుగురికి విద్యుత్ షాక్ తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు (Two people, died). మరో ముగ్గురికి సీపీఆర్ చేయగా, ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా (Prakasam district) లోని త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రంలో జరిగింది. మృతులు దేవయ్య, విజయకుమార్ గా గుర్తించారు.

