రంజని తండా ప్రజల 20 ఏళ్ల నిరీక్షణకు తెర

రంజని తండా ప్రజల 20 ఏళ్ల నిరీక్షణకు తెర

  • నెరవేరిన విద్యుత్ కల!

కుబీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా, కుబీర్ మండలం, రంజని తండా ప్రజలకు ఇదొక శుభవార్త. గత 20 ఏళ్లుగా మన తండాలో విద్యుత్ సమస్యల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన కరెంటు సౌకర్యం లేక చీకట్లో మగ్గిన రోజులను దృష్టిలో ఉంచుకుని, అప్పట్లో గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు ఆంధ్రప్రభ విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో స‌మ‌స్య‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి అధికారుల సమక్షంలో నిరంతర కృషి చేయడం వల్ల, పీఎం జుగ (PM JUGA) పథకం కింద 2026లో తండాకు 40 కొత్త విద్యుత్ స్తంభాలు (Poles) మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ పోల్స్ ఏర్పాటు చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ అభివృద్ధిని చూసి తండా ప్రజలందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన ఊరి వెలుగుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ గ్రామ‌స్తుఉ ధన్యవాదాలు తెలియ‌జేశారు.

Leave a Reply