వచ్చే రంజాన్ నాటికి సీసీ రోడ్డు పూర్తి చేస్తాం…

వచ్చే రంజాన్ నాటికి సీసీ రోడ్డు పూర్తి చేస్తాం…

  • ఈద్గా వద్ద లైట్లు కూడా ఏర్పాటు చేస్తాం
  • భక్తిశ్రద్ధలతో ఈద్గా వద్ద ప్రార్థనలు
  • ముఖ్యఅతిధిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుం టూ ఆప్యాయంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 14వ వార్డులోని ఈద్ గా వద్ద మత పెద్దలు ఏర్పాటు చేసిన నమాజ్‌ లో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్ నుంచి ఈద్గా వరకు సీసీ రోడ్డు నిర్మాణాన్ని వచ్చే రంజాన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈద్గా వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్న మత పెద్దల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదించాలన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నీల గట్టయ్య, పెసరు సారయ్య, పొన్నం రాజయ్య, సౌధరపల్లి సంపత్ రాజు, మత పెద్దలు మాషుక్, ఆఫ్సార్, హామీర్, బాబా, యాకూబ్, ఖాజా, మహ బూబ్, రహ్మతుల్లా, హయాత్, చాన్ పాషా, షకీల్, అరీఫ్, అక్రమ్, ఫెరోజ్, కలీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply