elections | ఎంఐఎం పోటీకి సిద్ధం….

elections | ఎంఐఎం పోటీకి సిద్ధం….
elections | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పోటీకి సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ మైసూర్(Abdul Qadir Mysore) అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊట్కూర్ పట్టణంలో సర్పంచి స్థానంతో పాటు 16 వాడు స్థానాలకు తమ అభ్యర్థులను పోటీలో ఉంచుతామని స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ(BC, SC, ST) బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి ఏఐఎంఐఎం పనిచేస్తుందని అన్నారు. ఊట్కూర్ పట్టణంలో గతంలో ఎంపీటీసీ, వార్డు స్థానాలకు పోటీ చేసినట్లు గుర్తుచేశారు. పేదల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని అన్నారు.
నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో(Sarpanch elections) ఊట్కూర్ పట్టణంలో ఎంఐఎం సత్తా చూపుతామని అన్నారు. ప్రజలు అభివృద్ధి చేసే తమ పార్టీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఊట్కూర్ మండల అధ్యక్షులు అబ్దుల్ మునీర్, పట్టణ అధ్యక్షుడు మమ్మద్ ఇస్మాయిల్, మాజీ అధ్యక్షులు మహ్మద్ పాషా, నాయకులు కొర్ల రఫీ, వికార్, యూనిష్, ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
