Elections | మూడు మున్సిపల్స్‌లో దూసుకుపోతున్న కారు

Elections | మూడు మున్సిపల్స్‌లో దూసుకుపోతున్న కారు
- కానరాని కాషాయం… డిపాజిట్ కూడా గల్లంతే..
- ప్రచారానికి కాంగ్రెస్ ప్రాధాన్యం…
Elections | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. నియోజకవర్గంలో మూడు చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చాలెంజిగా తీసుకొని ఎల్లంపేట, మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల చైర్మన్ లను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని భారీ ఎత్తున ప్రచార ఆర్భాటాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.. అధికార కాంగ్రెస్ కేవలం ప్రచారానికే పరిమితమైంది. కాషాయం పార్టీ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.
మూడింటిని కైవసం చేసుకునే దిశగా భారాస ముందుకు సాగుతోంది. ప్రతి వార్డుకు ఇంచార్జిని ఏర్పాటు చేసి కాంగ్రెస్, బీజేపీ లకు సవాల్ విసురుతున్నారు. ఈ సందర్భంగా చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకే దక్కుతుందని తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రమంతా ఇంటింటికి త్రాగునీరు, అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఇంచార్జ్ వెంకటరెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, శ్రీనివాసరెడ్డి, దయానంద్ యాదవ్, భాగ్యరెడ్డి, ఆకిటి నవీన్ రెడ్డి, రఘుపతి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
