ఎన్నికల హామీలు అమలు చేయాలి

ఎన్నికల హామీలు అమలు చేయాలి

  • ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి సందెన రవీందర్


( ఆంధ్రప్రభ, జనగామ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్(Pension of State Govt) పెంపు(Increase in pension) హామీని నెరవేర్చాలని ఎంఎస్ పీ జనగామ జిల్లా(Janagama District) అధికార ప్రతినిధి సందెన రవీందర్(Sandena Ravinder) అన్నారు శనివారం జనగామ ఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గ్రామ పంచాయితీల ఎదుట వికలాంగు లు, వితంతువులు(Widows), వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు(beedi workers), కల్లుగీత కార్మికులు పంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళనలో పాల్గొన్నారు. రూ.4000 ల పెన్షన్ ను రూ. 6000లకు పెంచాలని డిమాండు చేస్తూ నిరసన తెలిపారు. పంచాయతీ కార్యదర్శిలకు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(State Chief Minister Revanth Reddy) గత ఎన్నికల్లో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు పెంచుతామని హామీని ఇచ్చి విస్మరించారని, ఇప్పటికైనా ప్రభుత్వం హామీని అమలు చేయాలని, లేదంటే స్థానిక ఎన్నికల్లో(Local Elections) ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేయూత పెన్ష‌న్‌ దారు(Cheyuta pensioners)ల గ్రామ అధ్యక్షులు ఉమ్మడి సత్యనారాయణ, రామ్ నర్సయ్య(Ram Narsaiah), రంగారెడ్డి, యాదగిరి, చంద్రయ్య, జయమ్మ, పద్మ, సోమలక్ష్మి, లక్ష్మి, ఏసమ్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు.

Leave a Reply