election | మన గ్రామాభివృద్ధి కోసం..ఒక్క అవకాశం ఇవ్వండి

  • ఊరులోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాను.
  • అందరికీ అందుబాటులో ఉంటా..ఊరు కోసం పనిచేస్తాను
  • 2వ నెంబర్ కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి
  • కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పురుమాని కోమల అయిలోని

election | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మన నమిలిగొండ గ్రామాభివృద్ధి కోసం..ఒక్క అవకాశం ఇవ్వండి..మన గ్రామంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాను. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. ఊరు కోసం, ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం పని చేస్తాను. డిసెంబర్ 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో(election) 2వ నెంబర్ కత్తెర గుర్తుకు ఓటు వేసి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పురుమాని కోమల అయిలోని కోరారు. ఈ రోజు మండలం లోని నమిలిగొండ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిం చారు.

ఈ సందర్బంగా సర్పంచ్ గా గెలిపించి ప్రజా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను వేడుకున్నారు. అవకాశం ఇస్తే గ్రామస్తుల సమస్యలే పరిష్కారం లక్ష్యంగా పలు హామీలు వెల్లడించారు. వాటర్ ప్లాంట్ నుంచి సబ్‌స్టేషన్ వరకు రోడ్డు వెడల్పు చేయడంతో పాటు ఇరు పక్కల సైడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయిస్తాను. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తాను.

పెద్ద చెరువు తూము దగ్గర మరమ్మత్తు, గ్రామ పంచాయతీ భవనం, అంతర్గత సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. గ్రామస్తుల ఆశీస్సులతో తాను విజయం సాధిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పురుమాని కోమల అయిలోని తెలిపారు.

Leave a Reply