Election | ఎన్నికల చెక్‌పోస్టు తనిఖీ..

Election | ఎన్నికల చెక్‌పోస్టు తనిఖీ..
Election | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్ పూర్,చింతగూడ,పొనకల్, ఇందనపల్లి గ్రామపంచాయతీలోని సర్పంచ్లు,వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను మంచిర్యాల శ్రీనివాసరావు(Manchyryala Srinivasa Rao) ఈ రోజు పరిశీలించారు. ఇందన పల్లిలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా ఎన్నికల చెక్‌పోస్టు(Election Checkpost)ను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం అన్ని నిర్వహించాలన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తి చేయాల్సిందిగా ఆయన సూచించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఆయన వెంట తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి(Raja Manohar Reddy), ఎంపీడీవో ఉమర్ షరీఫ్,ఎంపీఓ జలంధర్, తదితరులున్నారు.
