Election | తండాను అభివృద్ధి చేస్తా..
Election, నెల్లికుదురు, ఆంధ్రప్రభ : దుర్గా భవాని తండాలో కాంగ్రెస్ నుండి పోటీలో వున్న గుగులోత్ భారతి సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపించాలని తండా వాసులను కోరారు. తనను గెలిపిస్తే.. తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉదయం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తండాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నధి తమ కుటుంబమే అన్నారు. విద్యావంతురాలైన తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.

