తాళ్ల పేట ముస్లిం మైనార్టీ నూతన కమిటీ ఎన్నిక

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్లపేట ముస్లిం మైనార్టీ గ్రామ కమిటీని ఆదివారం జామా మసీదులో ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా మహమ్మద్ ముస్తఫా, ఉపాధ్యక్షులుగా ఖాదర్, ప్రధాన కార్యదర్శిగా దావూద్ ఖాన్, సంయుక్త కార్యదర్శిగా శరీఫ్, క్యాషియర్ గా హైదర్ ఖాన్, ముఖ్య సభ్యులుగా ఉస్మాన్ ఖాన్ (జామా మసీదు అధ్యక్షులు), షఫీయోద్దీన్( మస్జిద్- ఏ – ఫాతిమా అధ్యక్షులు), అలీమ్ ఖాన్ ( ఖబ్రస్తాన్ కమిటీ అధ్యక్షులు), సోహైల్ ఖాన్ ( యూత్ కమిటీ అధ్యక్షులు)ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ రంజాన్ నెలలో హఫీజ్ లకు రెండు మసీదులకు రూ. 10 వేల చొప్పున అందిస్తానన్నారు. శుభ, అశుభ కార్యాలకు రూ. 5 వేల చొప్పున ప్రతి కుటుంబానికి అందిస్తానన్నారు. రెండు మసీదులు, ఈద్గా, ఖబ్రస్తాన్ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. ఎన్నికల అధికారిగా సీనియర్ జర్నలిస్ట్ నిజాం వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు భక్తవర్ ఖాన్, యూసుఫ్ ఖాన్ నిహాల్ ఖాన్, నజీర్ , మన్సూర్, షేక్ సాదిక్, మాలిక్ ఖాన్, సందాని, రషీద్ ఖాన్, అలీ ఖాన్, మహబూబ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, సాదిక్ బాబా, తాజ్ బాబా, బాబాఖాన్, ముజాహిద్, షబ్బీర్, షంషీర్, జాఫర్ ఖాన్, షేక్ సద్దాం, రాజ మహమ్మద్, మహబూబ్, హానీఫ్, రఫీక్, తాజ్, షేక్ ముస్తఫా, తదితరులు ఉన్నారు.
