Election Commission | ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి..

Election Commission | ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి..
- పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి
Election Commission | పెద్దపల్లి జిల్లా ఓదెల, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు విధులు నిర్వర్తించాలని పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి నాయక్(DCP Ram Reddy Naik) పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి నాయక్ ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి పరిశీలించారు.
కొలనూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ వద్ద ప్రజలతో డీసీపీ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, నాయకులు అందరూ సహకరించాలని సూచించారు.
శాంతి భద్రతలకు ఎలాంటి సమస్య రాకుండా నడుచుకోవాలని, ఎన్నికల కమీషన్(Election Commission) నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు కూడా ప్రజల సహకారంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిచేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ లు ఉన్నారు.
