Election Code | నిబంధ‌న‌లు పాటించేలా దృష్టి పెట్టాలి…

Election Code | నిబంధ‌న‌లు పాటించేలా దృష్టి పెట్టాలి…

Election Code | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి పారదర్శకంగా, శాంతియుతంగా పూర్తి చేసేలా చూడాలని మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ బాలకృష్ణ(Special Officer Dr. Balakrishna) అన్నారు.

ఈ రోజు మాస్టర్ ట్రైనర్(Master Trainer) పిన్నింటి బాలాజీరావు ఆధ్వర్యంలో మండల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, రూట్ అధికారులు, జోనల్ అధికారులకు ఎంపీడివో శివానంద్(MPDO Shivanand) అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ, ఎంపీడివో వెంకట శివానంద్, తహసిల్దార్ మహ్మద్ అబీద్ అలీ(Mohammed Abid Ali), సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ రెడ్డిలు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి మూలస్తంభం అని, ప్రతి ఓటరు ఓటు హక్కు పవిత్రమైనదిగా భావించి వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉన్నందున ఎన్నికలు నిబంధనలు పాటించేలా ద్రుష్టి పెట్టాలని అన్నారు.

ఎన్నికల కాలంలో ఎటువంటి అక్రమ చర్యలు, బెదిరింపులు, మద్యం, డబ్బు పంపిణీ వంటివి జరగకుండా చూడాలని, అన్ని గ్రామాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ విభాగాల అధికారులు, పోలింగ్ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply