Election campaign | కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి.

Election campaign | కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి.

Election campaign | దండేపల్లి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ఈ రోజు దండేపల్లి మండలంలో కన్నెపల్లి, నంబాల, వెల్గనూర్, ద్వారకా, ధర్మారావుపేట, తానిమడుగు, లక్ష్మీ కాంతాపూర్, గుడిరేవు, తాళ్ళపెట్, రాజుగూడ గ్రామాల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్, సభ్యులతో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహించారు.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల పాలనలో గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు(government funding) కేటాయించడం లేదని అన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తున్న బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బందెల రవి గౌడ్, గోపతి రాజయ్య, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, తమ్మినీడి శ్రీనివాస్, పతిపాక సంతోష్, ముత్తె అనిల్, గడికొప్పుల సురేందర్, బెడద సురేష్, దుమ్మని సత్తయ్య, కర్ణాల కిషన్, చుంచు లక్ష్మి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply