Election campaign | 9 వార్డు రూపు రేఖలు మారుస్తా

Election campaign | 9 వార్డు రూపు రేఖలు మారుస్తా

  • కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల రాజశ్రీ

Election campaign | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : గతంలో తాను కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా తొమ్మిదో వార్డు ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని, మరో సారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొమ్మిదో వార్డు అభ్యర్థి మల్లెల రాజశ్రీ, మల్లెల లక్ష్మణ్ కోరారు. సోమవారం తొమ్మిదో వార్డు లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో సారి అవకాశం ఇవ్వాలని వార్డు ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా రూపు రేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.

స్థానికుడిగా సమస్యలపై పట్టున్న నాయకురాలిగా అభివృద్ధి చేయడమే లక్యంగా పని చేస్తానని పేర్కొన్నారు. తొమ్మిదో వార్డు సభ్యులు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి, సమస్యలు సాల్వ్ చేస్తానని తెలిపారు. అభివృద్ధి కొరకు తపన పడే తన కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ సహకారం తో తొమ్మిదో వార్డు తో పాటు భీంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

అధికార పార్టీ కి ఓటర్లు అండగా ఉంటే అభివృద్ధి సులువు అవుతుందని, ఇతర పార్టీ అభ్యర్థులకు ఓటు వేయడం ద్వార అభివృద్ధి ని దూరం చేసుకున్న వారు అవుతారని పేర్కొన్నారు. అభివృద్ధి కావాలి అంటే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. వార్డు ప్రజలకు పింఛన్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు లతో పాటు కనీస సౌకర్యాలు ఏర్పాటు చెసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. చేతి గుర్తుకు ఓటు వేసి మెజారిటీ అందించాలని కోరారు.

Leave a Reply