Election | బీజేపీ అభ్యర్థుల గెలుపునకు నాయకుల ప్రచారం

Election | బీజేపీ అభ్యర్థుల గెలుపునకు నాయకుల ప్రచారం
- పట్టణంలో కార్నర్ మీటింగ్
Election | పరకాల, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈ రోజు మున్సిపల్ 21వ వార్డ్ అభ్యర్థి బండారి గిరి ప్రసాద్, 7వ వార్డ్ అభ్యర్థి ఆర్ పి జయంత్ లాల్ గెలుపే లక్ష్యంగా ప్రజలతో మమేకమై స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ఇంటింటా విస్తృత ప్రచార కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
