Election | ప్రజా సంక్షేమానికి బీజేపీ పెద్దపీట..

Election | ప్రజా సంక్షేమానికి బీజేపీ పెద్దపీట..

  • రాష్ట్ర పథకాలకు బీజేపీ సాయం
  • 11వ వార్డును ఆదర్శంగా అభివృద్ధి చేస్తా
  • ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి కడల మౌనిక రాములు

Election | జోగిపేట, ఆంధ్రప్రభ : ప్రజా సంక్షేమానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, గ్రామాలలో, మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లకు వాట కింద ఆర్థిక సాయం అందిస్తుందని 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కడల మౌనిక రాములు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు అభ్యర్థి కడల మౌనిక రాములు 11వ వార్డులో ఇంటింటికి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు.

బీజేపీ అభ్యర్థికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. జరుగుతున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి ఇంటి ఆడబిడ్డగా ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. 11వ వార్డు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ యువ నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply