తొర్రూరు టౌన్, జూలై 9(ఆంధ్రప్రభ) : అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతూ వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం… నియోజకవర్గంలోని కొడకండ్ల మండలానికి చెందిన పొన్నం పాండురంగ (75) కడుపు నొప్పితో బాధపడుతుండగా సుప్రీత హాస్పిటల్ (Supreeta Hospital) కు తీసుకొచ్చామని ఆస్పత్రిలో ఇంజక్షన్లు ఇచ్చి స్కానింగ్ తీసుకురమ్మని పంపించగా అక్కడికి వెళ్ళేసరికే మృతి చెందాడని ఆరోపించారు.
తిరిగి మృతుడు పాండురంగ (Panduranga) ను శృతి హాస్పిటల్ వద్దకు తీసుకువచ్చి బయట పడుకోబెట్టి ఆందోళనకు దిగారు. మృతికి పూర్తిగా కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఉపేంద్ర (SI Upendra) ఆధ్వర్యంలో ఆస్పత్రికి చేరుకొని మృతికి కారణాలను తెలుసుకుంటున్నారు. బాధితులను ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. మృతుడు పాండురంగకు ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు.