EGS | ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఉత్తమ అవార్డు

EGS | ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఉత్తమ అవార్డు కడెం ( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నాగవత్ రవీందర్ జిల్లా ఉత్తమ సేవలు అందించినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల నిర్మల్ డిఆర్ డిఓ విజయలక్ష్మి నిర్మల్ ఆర్డిఓ రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ సేవల ప్రశంస పత్రాన్ని అందుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ నాగవత్ రవీందర్ కు కడం ఈజీఎస్ ఏపీవో జయదేవ్, ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నాగవత్ సరిత, జిపి వార్డు సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, కడెం మండలం ఈ జి ఎస్ కార్యాలయం సిబ్బంది, టిఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆయా పార్టీల నాయకులు, ఉడుంపూర్ జిపి పరిధిలోని గ్రామస్తులు అభినందించారు.
