Egg Carts | ఇక వీధుల్లో ఎగ్ కార్ట్స్

  • కొండపిలో మంత్రి డోలా అందజేత

టంగుటూరు (ప్రకాశం జిల్లా) , ఆంధ్రప్రభ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ , NECC (నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ) సహకారంతో కొండపి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు తూర్పు నాయుడుపాలెం (Turpu Naidu Camp) క్యాంపు కార్యాలయంలో ఎగ్ కార్ట్స్ తోపుడు ( Egg Carts) బండ్లను ఆదివారం మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి (Ap Minisdter Dola) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలలో ఆర్థిక పరిపుష్టిని ( Financial Empowerment) , సామాజిక భద్రత దిశగా పౌష్టికాహారం అందించే లక్ష్యంతో డీఆర్డీయే వెలుగు స్వయం సహాయక బృందం మహిళలకు ఎగ్ కార్ట్ ( Egg Carts) తోపుడు బండ్లకు ప్రభుత్వం రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. ఈ ఎగ్ కార్ట్స్ ఏర్పాటు ద్వారా కోడిగుడ్లు ఉత్పత్తులను (Eggs Productio) మహిళలు వినియోగించి వారిలోని పౌష్టికాహార లోపాన్ని అధిగమించాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Chandra Babu) ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక ఎగ్ ఎగ్ కార్ట్స్ బండి ఏర్పాటునకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెంచుతామన్నారు. కొండపి నియోజకవర్గంలో (Kondapi) ఆరు ఎగ్ కార్ట్స్ బండ్ల ఏర్పాటునకు లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక సాయం చేశామన్నారు.

P4 కార్యక్రమంతో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఇంటికొక పారిశ్రామికవేత్త లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, స్వయం ఉపాధి ప్రోత్సాకాలతో p4 కార్యక్రమంతో పేదరిక నిర్మూలన దిశగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.మహిళలు (women self employment) స్వయం ఉపాధికి ఎగ్ కార్ట్స్ఉపయోగపడతాయన్నారు. కొండపి నియోజకవర్గంలోని 6 మండలాలకు ఆరు ఎగ్ కార్ట్స్ మంజూరు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply