Khanapur | మార్నింగ్ వాక్ తో సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కడెం, జులై 15 (ఆంధ్రప్రభ) : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పొద్దు పొడుపు బొజ్జన్న అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) అన్నారు. మంగళవారం కడెం మండల కేంద్రంతో పాటు పెద్దూరు గ్రామంలో మార్నింగ్ వాక్ (Morning walk) నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదురుకుంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులను (Infrastructure) మెరుగు పరుస్తామన్నారు. నాడు బీఆర్ఎస్ హయంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

ప్రజా ప్రభుత్వం హయాంలో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. పింఛన్ రానీ వారికి త్వరలో పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఖానాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగల భూమన్న భూషణ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పి సతీష్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెెంకల శ్రీనివాస్ యాదవ్ పెద్దూర్ గ్రామ మాజీ సర్పంచ్ లు కే అనుషా లక్ష్మణ్ చిట్యాల చిన్నయ్య కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వాజిద్ ఖాన్ ఎం ఏ రహీం తొట్ల ధర్మయ్య పాలకుర్తి కృష్ణ తొట్ల గంగాధర్ బబ్లు వసి బ్రహ్మచారి పెద్దూర్ పంచాయతీ కార్యదర్శి మునురుల్ హసన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply