బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతిగా పూలే…

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతిగా పూలే…

మహిళా విద్యకు కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : పట్టణంలో మహాత్మా 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే సెంటర్ వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య, తెలుగుదేశం పార్టీ నాయకులు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ… మహాత్మా జ్యోతిరావు ఫూలే అంటరానితనం,కులవ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు.

దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడం, మహిళల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు ఆయన చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని, ఆయన ఆశయాలను కొనసాగించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, ఖాతా రమేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జాకీర్ హుస్సేన్, షకీల్ అహ్మద్, లాయర్ జాకీర్, జమీల్ మూర్తి, జావలి క్లస్టర్ ఇంచార్జ్ మద్దిలేటి పాణ్యం వేణుగోపాల్, ఆర్ట్ శీను, ధర్మారెడ్డి, గిరి, శ్రీకాంత్ గౌడ్, ఎళయ ఆచారి, నిమ్మకాయల రాజు, నిమ్మకాల మోహన్, కళాఖర్ చాంద్బాషా భరత్, లింగమయ్య, సర్వోత్తమ్ రెడ్డి, రజిని కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహిళ నాయకురాలు మీనాక్షి దేవి, వనజ, అనురాధ, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply