ED Gang6 | 1987 లో ముంబై కథ ఇదే

ED Gang6 | 1987 లో ముంబై కథ ఇదే

Ed Gang6 | ఆ కేసు ఇంకా మిస్టరీ నే
ఇప్పుడు డిల్లీలఓ నకిలీ ఈడీ దాడి
పనిమనిషే మాస్టర్‌మైండ్
ఈడీ లాయర్ ఎంట్రీతో కొత్త ట్విస్ట్
స్పెషల్ 26 తరహాలోనే ఈ స్టోరీ బిగ్ మిస్టరీ

ED Gang6 | ఆంధ్ర‌ప్ర‌భ‌, న్యూఢిల్లీ : తెలుగు సినిమా గ్యాంగ్ .. హిందీ మూవీ స్పెష‌ల్ 26 , క‌నీసం తమిళ చిత్రం ‘తానా సెర్న్ధ కూట్టమ్ చూశారా? భాష‌లు వేరైనా.. ఈ క‌థ ఒక్క‌టే. న‌టులూ వాళ్లే. త‌మ అద్బుత న‌ట‌న‌తో హీరో సూర్య , కీర్తి సురేష్, కార్తీక్, రమ్య కృష్ణ జ‌నాన్ని సీట్ల‌కు క‌ట్టేశారు. గుర్తుందా? 2018లో వెండితెర‌పై ఈ సినిమా ఉర్రూత‌లూగించింది. ఓ న‌కిలీ సీబీఐ అధికారుల బృందం కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన అవినీతి ప‌రుల ఇళ్ల‌ను కొల్ల‌గొట్టేస్తుంది. ఈ సినిమా తీయ‌టానికి ఇతివృత్తం 39 ఏళ్ల కింద‌ట అదే 1987 మార్చి 19న ముంబైలోని ఒపెరా హౌస్‌లో ‘ట్రిబ్యూవన్‌దాస్ భీమ్‌జీ జవేరి’ అనే నగల దుకాణంపై 26 మంది న‌కిలీ సీబీఐ అధికారులు దాడి చేశారు.

సిసిటివి కెమెరాలను ఆపివేయించి, సోదాల పేరుతో సుమారు ₹30-35 లక్షల నగలు, నగదును బ్యాగుల్లో నింపుకుని అజయ్ సింగ్ (అసలు పేరు ఇప్పటికీ ఎవరికీ తెలియదు). మాయమయ్యాడు. అత‌డు ఇప్పటీ పోలీసుల‌కు చిక్క‌లేదు. దొర‌క‌లేదు. ఈ కేసు ఇప్ప‌టికీ మిస్ట‌రీగా నే ఉంది. ఈ సినిమా క‌థ ప్ర‌స్తుతం మీడియా తెర‌మీద‌కు ఎందుకు వ‌చ్చిందంటే.. న్యూఢిల్లీలో ఇళ్ల‌ల్లో ప‌ని చేసే ఓ నౌఖ‌రీ సిద్ధం చేసిన నకిలీ ఈడీ రైడ్స్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ న‌గ‌దు, బంగారు న‌గ‌ల‌తో పారిపోయిన ముగ్గురి జాడ దొర‌క‌టం లేదు. ఈ కేసు, కూడా స‌రికొత్త మిస్ట‌రీ క్రైమ్ స్టోరీ కాబోతోంది.. అస‌లు క‌థ తెలుసుకుందా?

ED Gang6

ED Gang6 | ఢిల్లీలో నకిలీ ఈడీ రైడ్”

(Fake ED Raid) సంచ‌ల‌నం సృష్టించింది. రిటైర్డ్ ఆర్కిటెక్ట్ ఆర్.సి. సభర్వాల్ (86_ , ఆయన భార్య ఉషా సభర్వాల్ ద‌క్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉంటున్నారు. ఈ ఇంట్లో రేఖ దేవి (40) ప‌ని పమ‌నిషిగా గ‌త రెండేళ్లుగా ప‌ని చేస్తోంది. వృద్ధులిద్ద‌ని గ‌మ‌నించింది. బాగా డ‌బ్బున్న మారాజులే. వీరి ద‌గ్గ‌రు బంధువుల రాక అంతంతే. ఈ ఇల్లు కొల్ల‌గొట్టేస్తే సుఖంగా జ‌ల్సా చేయ‌వ‌చ్చ‌ని అత్యాశ‌కు లొంగిపోయింది త‌న బంధువు పూజా రాజ్ పుత్ తో క‌లిసి ప్లాన్ చేసింది. రేఖా దేవీ మాస్టర్‌మైండ్ తో నకిలీ ఈడీ బృందం అవ‌త‌రించింది. ఐటీబీపీ (ITBP) కానిస్టేబుల్ ప్రకాష్, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఉపదేశ్ సింగ్ థాపా, మ‌రో యువ‌కుడితో న‌కిలీ ఈడీ గ్యాంగ్ రెడీ అయింది. అంతే.. ఫిబ్రవరి 11న ఆర్సీ సభర్వాల్, ఉషా దంపతుల ఇంటిపై నకిలీ ఈడీ రైడ్‌ జరిగింది. ఈడీ అధికారుల పేరుతో ఆ ముగ్గురు వ్యక్తులు సోదాలు ప్రారంభించారు. ఆ దంపతులు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బీరువాల నుంచి నగదు, నగలను, ఖరీదైన వాచీలను బయటకు తీయించారు.

ED Gang6

ED Gang6 | ఇక్క‌డే కొత్త ట్విస్ట్ …

న‌కిలీ ఈడీ ఆఫీస‌ర్లు ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో, యజమాని భార్య ఉష తన వద్ద ఉన్న మరో ఫోన్‌తో తన మనవడు గౌరవ్‌కు సమాచారం అందించారు. అతను స్వయంగా ఈడీ (ED) తరపు న్యాయవాది కావడంతో, అది నకిలీ రైడ్ అని వెంటనే గుర్తించారు. తన మనవడు ఈడీ న్యాయవాది అని అత‌డ వచ్చి మాట్లాడతాడని ఆ ముగ్గురుకి ఆమె చెప్పింది. అంతే డామిట్ క‌థ అడ్డం తిరిగింద‌ని గుర్తిచిన ఆ ముగ్గురు సుమారు 4 లక్షల డబ్బు, బంగారు ఆభరణాలు, ఏడు ఖరీదైన వాచీలతో పారిపోయారు.

ED Gang6

Ed Gang6 | పోలీసులు అవాక్కు

దంప‌తుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. న‌కిలీ ఈడీ అధికారుల పేరుతో నేరం జ‌ర‌గ‌టం ఒక ఎత్తు.. ఈడీ కేసులు వాదించే లాయ‌రు కుటుబ స‌భ్యుల‌నే నేర‌గాళ్లు దోచేశారు. ఈ కేసును ర‌హ‌స్యంగా చేదిస్తామ‌ని బ‌తిమాలాడి, బామాలి ద‌ర్యాప్తు ప్రారంభించారు. 300కు పైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నకిలీ ఈడీ రైడ్‌ కోసం ఆగంత‌కులు వాడిన కారు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఘజియాబాద్‌లోని ఒక ఇంట్లో గుర్తించారు. ఆ ఇల్లాలు ఎవ‌రిదో కాదు.. రేఖాదేవీ బంధువు పూజా రాజ్‌పుత్ . ఆమెను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించారు. ఆర్సీ సభర్వాల్ (Rc Sabharwal) ఇంట్లో రెండేళ్లుగా పని చేస్తున్న రేఖ దేవి ఈ కుట్ర పన్నినట్లు గుర్తించారు. కానీ న‌కిలీ ఈడీ అధికారుల ఆచూకీ ల‌భించ‌లేదు. సాంకేతిక ప‌రిజ్ఞానాకికి జాడ లేదు. ప్ర‌స్తుతం ఈ కేసు కూడా స్పెష‌ల్ 26 త‌ర‌హాలో.. మిస్ట‌రీగానే మారిపోతుందా? అని జ‌నం అనుమానిస్తున్నారు.

ED Gang6

CLICK HERE TO READ  లఖనవూలో తండ్రిపై కుమారుడి దారుణం.. ఆపై మిస్సింగ్ డ్రామా

CLICK HERE TO READ MORE

Leave a Reply