ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న హిమాచల్‌ప్రదేశ్‌ను తాజాగా భూకంపం వణికించింది. చంబా ప్రాంతంలో వరుసగా రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరుస విపత్తులతో హడలెత్తిపోతున్నారు. బుధవారం తెల్లవారుజామున చంబా జిల్లాలో రెండు సార్లు భూకంపం సంభవించింది. ఉదయం 4:39 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. గంట తర్వాత అదే ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. రెండు ప్రకంపనలు వరుసగా 10 కి.మీ, 20 కి.మీ లోతుతో సంభవించాయి. అయితే భూకంపాలు కారణంగా ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు అధికారులు ఏమీ వెల్లడించలేదు. ఇక జూన్ 20 నుంచి రుతుపవనాలు కారణంగా సంభవించిన వరదలు కారణంగా 276 మంది చనిపోయారు. వీరిలో 143 మంది కొండచరియలు విరిగిపడి, ఆకస్మిక వరదలు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
హిమాచల్‌లో భూకంపం
