Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం…
Earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజామున వరుస భూప్రకంపనలు (Earthquake) సంభవించాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో జనం ఇళ్ల నుంచి ఖాళీ ప్రదేశాలకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం, అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున 4:17 గంటలకు భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలు (Richter scale) పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో గువాహటితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రకంపనలు బలంగా కనిపించాయి.

