Earthquake | పాకిస్థాన్‌లో భూకంపం.. తీవ్రత 5.8గా నమోదు

పాకిస్థాన్‌ : పొరుగుదేశం పాకిస్థాన్‌ లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1 గంట (స్థానిక కాలమానం ప్రకారం ) సమయంలో భూ ప్రకంపనలు నమోదైనట్లు తెలిపింది.

భూమికి 10కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ భూకంపం ధాటికి జమ్ముకశ్మీర్‌లోనూ భూమి కంపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *