ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రష్యా(Russia) కమ్చట్కా ద్వీపకల్పంపై భూకంపం(Earthquake) రూపంలో పకృతి విరుచుకు పడింది. ఆస్తి నష్టమే కానీ ప్రాణనష్టం జరగలేదు. భూకంపం తీవ్రత తారాస్థాయిలో ఉంది. తూర్పు తీరంలో ఈ భూకంపం కలవరం సృష్టించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ (GFZ) ఈ భూకంప తీవ్రతను 7.1గా నిర్ధారించింది. ఇది 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్టు జీఎఫ్ జెడ్ వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) దీనిని 7.4గా లెక్కకట్టింది.

భూకంప కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్ -కమ్చాట్స్కీ నుంచి 111.7కి.మీ (69.3 మైళ్లు) తూర్పున 39.5 కి.మీ లోతులో ఉన్నట్లు జీఎఫ్జీ నిర్ధారించింది. పసిఫిక్ సునామీ హెచ్చరిక(Pacific tsunami warning) వ్యవస్థ ప్రకారం.. ఈ భూకంపం సునామీకి దారితీసే ప్రమాదం ఉన్నట్టు హెచ్చరించింది. యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా ఈ భూకంపం తర్వాత హెచ్చరిక జారీ చేసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. పొరుగు దేశమైన జపాన్‌(Japan)లో సునామీ హెచ్చరిక జారీ కాలేదు. జపాన్ మెటీరియాలాజికల్ ఏజెన్సీని ఉటంకిస్తూ ప్రసార సంస్థ NHK, అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు చెప్పింది.

Leave a Reply