బెజవాడలో ఈగల్ వల

19 గ్రాముల ఎండిఎంఏ పట్టివేత
అదుపులో ఇద్దరు విద్యార్థులు…
బెంగళూరు నుండి వైజాగ్ తరలిస్తుండగా…
మాచవరం పోలీసులు చాకచక్యం
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ(Vijayawada)లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra Pradesh) కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ(Vijayawada)లో తరచూ డ్రగ్స్ ఆనవాళ్లు దొరకడం స్థానికులను ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు వివిధ సందర్భాలలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు (Police) తాజాగా గురువారం తెల్లవారుజామున ఎండిఎంఏ డ్రగ్స్ (MDMA Drugs)ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం(Visakhapatnam) కి చెందిన అర్జల శ్రీ వాత్సవ్, బీ హావిలా అన్న ఇద్దరు విద్యార్థుల నుండి 19 గ్రాముల ఎండిఎంఏ ను మాచవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు నుండి విశాఖపట్నంకు….
విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న శ్రీ వాత్సవ్, ఎంబీఏ పూర్తిచేసిన బి హవిలా ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూ డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఇప్పటికే పలు దఫాలుగా వీరు డ్రగ్స్ ను సేవిస్తూ, ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఈజీ మనీ కోసం డ్రగ్స్ సప్లై దారుగా మారుదామని ఆలోచనలతో విశాఖపట్నం నుండి బెంగళూరు (Bengaluru) డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అక్కడ సుమారు లక్ష రూపాయల విలువైన 19 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణం ప్రైవేటు ట్రావెల్స్(Private Travels)లో విశాఖపట్నం వెళుతుండగా ఈగల్ టీమ్(Eagle Team)కు వచ్చిన పక్కా సమాచారంతో విజయవాడలోని మహానాడు రోడ్డు జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున 3:30 నిమిషాల ప్రాంతంలో బస్సు చెక్ చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
