ప్ర‌తి ఇంటికీ బాకీ కార్డు

ప్ర‌తి ఇంటికీ బాకీ కార్డు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: ఎన్నిక‌ల స‌మ‌యంలో గ్రామాల్లోకి వ‌చ్చిన కాంగ్రెస్(Congress) నాయ‌కుల‌ను నిల‌దీయాల‌ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి(Gandra Venkata Ramana Reddy) అన్నారు. ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లి, భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డుల‌ను ప్రతి ఇంటికీ ఆయ‌న అంద‌జేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మనకి పడ్డ బాకీ గురించి ఈ కార్డుల్లో వివ‌రించామ‌న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం(Govt) స్పందించి 60 నెల కాల వ్యవధిలో 22 నెలలు కాలం అయిపోయిందని, మిగిలిన‌ 38 నెలలు మాత్రమే సమయం ఉంద‌ని, ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.

ఎంపీటీసీ,జడ్పిటిసి(MPTC, ZPTC), సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెట్టిన ప్రజలు ఓట్ల రూపంలో ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని కోరారు. ఆయ‌న వెంట‌ భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply