రాజధానిలో దసరా సందడి

  • డీప్యూటీ సీఎం అభిమానుల సంబరం

గుంటూరు, ఆంధ్రప్రభ : OG సినిమా విడుదల సందర్భంగా రాజధాని ప్రాంతంలో జనసేన(Janasena) సంబరాలు మిన్నంటాయి. తాడేపల్లి మండలం – ఉండవల్లి సెంటర్‌లో జనసేన నాయకుడు జొన్నరాజేష్(Jonna rajesh) నేతృత్వంలో OG సినిమా విడుదల సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు.

భారీ కటౌట్‌లు(huge cutouts), థియేటర్ పరిసరాల్లో ఫ్లెక్సీలతో దసరా వాతావరణం నెలకొంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత, పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్(Konidela Pawan Kalyan) కటౌట్ వద్ద అభిమానులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాణాసంచా, పూలమాలలు, తీన్మార్ వాయిద్యాలతో తమ అభిమానాన్నిచాటుకున్నారు.

అనంతరం తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు(Nageswara Rao), జనసేన నాయకులు జొన్నరాజేష్‌తో కలిసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా జొన్నరాజేష్ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాక, రాజకీయ రంగంలోనూ తనకు తానే సాటిలేని నాయకుడని నిరూపించుకున్నారు.

OG సినిమా ఆయన క్రేజ్‌(craze)ను మరింత పెంచి, అభిమానులకు గర్వకారణంగా నిలుస్తుందని” ఆశాభావం(hope) వ్యక్తం చేశారు. ఈ వేడుకలు పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు, జనసేన కార్యకర్తలకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందించాయి.

Leave a Reply