ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ నియమితులయ్యారు.
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సంస్థ కార్యవర్గ సమావేశంలో ఈ నియామకాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
డూండి రాకేష్ ఈ పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు. ఈ సందర్భంగా అడ్వైసరీ బోర్డ్ సెంట్రల్ కమిటీ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చైర్మన్ గంజి రాజ్యమౌళి గుప్త, ఐవిఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస గుప్త చేతుల మీదుగా నియామక పత్రాన్ని డూండి రాకేష్ స్వీకరించారు.
సంస్థను రాష్ట్ర గౌరవ అధ్యక్షుడి హోదాలో రాకేష్ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని సమావేశానికి హాజరైన నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కోనా శ్రీనివాస్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుంట్ల రామ్మోహన్, ప్రముఖ ఆర్యవైశ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

