DSP Mahesh | మారథాన్‌లో సత్తా చాటిన డీఎస్పీ మహేష్

DSP Mahesh | మారథాన్‌లో సత్తా చాటిన డీఎస్పీ మహేష్

  • అభినందించిన ఎస్పీ డాక్టర్ వినీత్

DSP Mahesh | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : ముంబై మారథాన్–2026లో నారాయణపేట జిల్లా నుంచి పాల్గొన్న డీసీఆర్బి డీఎస్పీ మహేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టాటా ముంబై మారథాన్ (42.197 కిలోమీటర్ల లాంగ్ రన్) లో పాల్గొన్న ఆయన 5 గంటల 21 నిమిషాలు 30 సెకండ్ల ఉత్తమ టైమింగ్‌తో మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి రెండు మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ డీఎస్పీ మహేష్‌ను మెడల్స్‌తో సత్కరించి హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… పోలీస్ విధులు నిర్వహిస్తూ కూడా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం డీఎస్పీ మహేష్ ప్రత్యేకత అని అన్నారు.

ఆయన సాధించిన విజయం యువతకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. నిరంతర సాధనతో క్రీడల్లో ముందుకు సాగుతూ జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చినందుకు డీఎస్పీ మహేష్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. డీఎస్పీ మహేష్ సాధించిన ఈ ఘన విజయం నారాయణపేట జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, క్రీడాభిమానులు కొనియాడారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి మారథాన్ పోటీల్లో పాల్గొని మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య కూడా హాజరై, ముంబై మారథాన్‌లో రెండు మెడల్స్ సాధించిన డీఎస్పీ మహేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply