DSP | పాత కేసులను పరిష్కరించాలి

DSP | పాత కేసులను పరిష్కరించాలి
- డీఎస్పీ వెంకటరామయ్య
DSP | తుగ్గలి, ఆంధ్రప్రభ : మండలంలోని జొన్నగిరి పోలీస్ స్టేషన్ను శుక్రవారం పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి, పట్టుబడ్డ వాహనాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వివిధ దశల్లో పాత కేసులు పెండింగ్లో ఉన్న వాటిని పరిశీలించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పేకాట, మట్కాను పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజలలో నమ్మకం పెంచాలన్నారు. చోరీ కేసులు నమోదైన వెంటనే ఛేదించాలని, రాత్రి వేళల్లో గస్తీ, విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్లో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ కేసులో పోలీసులు నిబద్ధతతో పనిచేస్తే, నేరస్థుల్లో భయం, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్, జొన్నగిరి ఎస్సై మల్లికార్జున, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
