Nandyala | మత్తుగా డ్రైవింగ్.. తప్పిన ప్రమాదం..

నంద్యాల బ్యూరో, జూన్ 2 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవే సమీపాన సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టిప్పర్ అదుపుతప్పి బైక్ పైకి దూసుకెళ్లడంతో ఇద్ద‌రు వాహ‌న‌దారులు తీవ్రంగా గాయపడ్డారు. నందికొట్కూరు హైవేపైన రోడ్డుకు అవతల వైపు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది.

ఈప్ర‌మాదంలో బైక్ పై వెళ్తున్న‌ ఎల్లాగౌడ్, రెహమాన్ లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నందికొట్కూరు సిఐ తెలిపారు.

Leave a Reply