తాగి తోలుతున్నారా… ఇక అంతే… మొదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

తాగి తోలుతున్నారా… ఇక అంతే… మొదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

పెద్దపల్లి ఆంధ్రప్రభ : నూతన సంవత్సర వేడుకల్లో తాగి తమాషా చేస్తా అంటే తాటతీస్తామంటున్నారు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు. బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రం తో పాటు ప్రధాన కూడళ్లలో పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు. తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే కఠిన చర్యలు తప్పవు అన్నారు.

తెల్లవారుజాము వరకు వాహన తనిఖీలు కొనసాగుతాయని, ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ వారి ఇళ్లలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని సూచించారు. తనిఖీల్లో ట్రాఫిక్ ఎస్ఐలు రాజావర్ధన్, సహదేవ్ సింగ్, రవీందర్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply