హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుగుతుంది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అద్దంకి నుంచి వచ్చి కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు ఈ నిందితులు. కాగా, పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు.. ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. ఇక, ఈ నిందితుల నుంచి సుమారు 800 గ్రాముల ఎపిడ్రిన్, హెరాయిన్, 5 మొబైల్ ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ డ్రగ్ ముఠాలో తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు.
మరోవైపు, సికింద్రాబాద్ లో కూడా భారీగా డ్రగ్స్ ను టీఎస్ నాట్ పట్టుకుంది. నైజీరియాకి చెందిన ఇమాన్యుయల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇమాన్యుయల్ నుంచి 150 గ్రాముల కొకైన్ పాటు ఎక్స్టెన్సీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు కోట్ల పైచిలుకు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు టీఎస్ నాబ్ సిబ్బంది. చదువుకోవడానికి ఇండియాకు వచ్చి డ్రగ్స్ అమ్ముతున్న ఇమాన్యుయల్.. ఇండియా నుంచి వస్త్రాల ఎగుమతి పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఒకడంత వస్త్రాల ఇంపోర్ట్ ఎక్స్ పోర్ట్ పేరుతో డ్రగ్స్ బిజినెస్ కొనసాగించాడు. ఒక్క నెలలోనే కోటి రూపాయలకు పైచిలుకు డ్రగ్స్ ను ఈ నైజిరియన్ అమ్మినట్లు తేలింది. ఇండియా- నైజీరియా మధ్య పలుమార్లు తిరుగుతూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేశాడని టీఎస్ నాబ్ అధికారులు వెల్లడించారు