82 కోట్ల కొకైన్ స్వాధీనం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దోహా నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలి నుంచి దాదాపు రూ.82 కోట్లు విలువ చేసే 5.5 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం సృష్టించింది.
సదరు మహిళ కొకైన్‌ను బంగారు రంగు చాక్లెట్లలో నింపి తరలించేందుకు ప్రయత్నించింది. అయితే, కస్టమ్స్ అధికారులు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఈ భారీ మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి. అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని, ఎన్‌డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.