పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి వద్ద ప్రమాదం
ఏడుపాయల జాతరకు వచ్చిన నలుగురు యువకులు.
మెదక్ – మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంజీరా నదిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. కొల్చారం (మం) పోతంశెట్ పల్లి శివారులో రెండో బ్రిడ్జి వద్ద నేడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడుపాయల జాతరకు వచ్చిన నలుగురు యువకులు తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా నదిలోకి స్నానానికి దిగారు. నదిలో మునిగి పోయిన వారిలో కృష్ణ (20), షామా (21) ఉన్నారు. ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఉన్న మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయట పడ్డారు. మునిగిపోయిన వారిని పోలీసులు సహాయంతో బయటకు తీయించి.. మృతదేహాలను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.